Breaking News

దుబ్బాక; సిద్దిపేట్ _మెదక్ హైవే పై యాక్సిడెంట్

మన ప్రగతి న్యూస్/దుబ్బాక

సిద్దిపేట్_మెదక్ ప్రధాన రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కింద పడటంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అక్బర్పేట్ భూంపల్లి మండలం వీరారెడ్డిపల్లికి చెందిన నర్సింలు దంపతులు బైకుపై సిద్దిపేటకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నర్సింలుకు తీవ్ర గాయాలు కాగా, మరో మహిళ కు కూడా గాయాలయ్యాయి.

ఘోర రోడ్డు ప్రమాదం! యువకుడు మృతి!!