Breaking News

తమ్ముని మృతికి కారణమైన అన్న అరెస్టు సిద్దిపేట టూ టౌన్ పోలీస్.

మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి.

బోయగల్లి సిద్దిపేటలోని వంగలి రాములు, వంగలి ప్రభు, వంగలి కొండలు అని వారికి సంబంధించిన పాత ఇల్లు దరచేసుకోగా , వంగలి కొండలు పట్టుకొని మిగతా ఇద్దరికీ డబ్బులు చెల్లించినాడు కానీ అట్టి ఇంటిని కొండాల పేరు మీద మార్చుటకు డబ్బులు తీసుకొని కూడా రాములు సంతకం చేయకుండా వేధింపులు చేయుచు మరియు అమ్మమ్మకు చెందిన 60 గజాల భూమిని ఎవరికి తెలవకుండా వంగలి రాములు తన భార్య చంద్రకళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని అడిగినందుకు కొండాలును రాములు మరియు అతని భార్య చంద్రకళ దుర్భాషల తో అవమానించినందున అట్టి అవమానం భరించలేక ఫిబ్రవరి 15 రోజున వంగలి కొండలు పురుగుల మందు తాగుట వల్ల అది విషమించి ఫిబ్రవరి 22 రోజున అస్వస్థకు గురికాగా తన కుటుంబ సభ్యులు సిద్దిపేటలోని ప్రభుత్వాసుపత్రి తరలించి మెరుగైన చికిత్స గురించి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించుండగా ఫిబ్రవరి 26 రోజున మరణించినాడని మృతుని యొక్క రెండవ అన్నయ్య వంగలి ప్రభు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపేందర్ ఇన్స్పెకర్ అఫ్ పోలీస్ టూ టౌన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి, ఈరోజు నిందితులు అయిన వంగలి రాములు అతని భార్య చంద్రకళను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగినదని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు.

ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధుడు