Breaking News

వేములవాడలో పారిశుద్ధ్యానికి కొత్త వాహనాలు ప్రారంభం

రూ.21.50 లక్షలతో 2 ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్ ట్రాలీ కొనుగోలు

మన ప్రగతి న్యూస్ /వేములవాడ:

ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచేందుకు కొనుగోలు చేసిన కొత్త వాహనాలను సోమవారం మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు ప్రారంభించారు. రూ.21.50 లక్షల వ్యయంతో రెండు ట్రాక్టర్లు, ఒక వాటర్ ట్యాంకర్ ట్రాలీని మున్సిపాలిటీ కొనుగోలు చేసింది.మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వైస్ ఛైర్మన్, కమిషనర్, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.పట్టణంలో చెత్త సేకరణను వేగవంతం చేయడం, పారిశుద్ధ్య పరిస్థితులను మరింత మెరుగుపరచడం కోసం ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఛైర్మన్ తెలిపారు. కొత్త వాహనాల ద్వారా పట్టణంలో చెత్త సేకరణ, శుభ్రత పనులు మరింత సమర్థవంతంగా నిర్వహించగలమని పేర్కొన్నారు.