Breaking News

ముస్త్యాలపల్లిలో త్రాగునీటి ముందస్తు ఎద్దడి చర్యలు..

  • చేతి పంపులకు మరమ్మతులు చేయించిన సర్పంచ్ వెంకటేష్..

మన ప్రగతి న్యూస్/నడికూడ:

వేసవికాలం దృష్టా ప్రజలకు నీటి సమస్య రాకుండా చర్యలు చేపడుతున్నామని నడికూడ మండలం ముస్త్యాలపల్లి గ్రామ సర్పంచ్ మేకమల్ల వెంకటేష్ అన్నారు. గ్రామంలోని చేతి పంపులకు మరమ్మతు లు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వేసవిలో నీటి ఎద్దడి దృష్ట్యా గ్రామంలో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే గ్రామం లోని మరమ్మత్తుకు నోచుకోని చేతిపంపులను బాగు చేయించినట్లు తెలి పారు. గ్రామంలోని ప్రజలకు తాగునీరు సరఫరా చేసే పైపుల నుండి నీరు లీకేజీ కాకుండా అరికట్టామని పేర్కొన్నారు. గ్రామంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధుడు