Breaking News

ఉచిత పశువైద్య శిబిరం.

మన ప్రగతి న్యూస్/ గుండాల ప్రతినిధి :

పశు గణనాభివృద్ధి – పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గుండాల మండలంలోని తుర్కల శాపురం గ్రామంలో మంగళవారం పశువులకు గాలికుంటు నివారణ టీకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పశు మండల వైద్యాధికారి 284 పశువులకు గాలికుంటు నివారణ టీకాలు,48 పశువులకి గర్భకోశ వ్యాధి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశామని డాక్టర్ యాకూబ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉచిత పశు వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కునగళ్ళ లిల్లీ గణేష్, ఉప సర్పంచ్ పురుగుల సరిత మచ్చ గిరి, గోపాలమిత్ర సూపర్వైజర్ భానుచందర్, గోపాల్ మిత్రులు వంగూరి గోవింద్, కృష్ణ శేఖర్ శ్రీను నరేష్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కుషాయిగూడలో యువకుడి అదృశ్యం