Breaking News

మున్సిపల్ అభివృద్ధికి సహకరించండి

మున్సిపల్ ల్లో జనరల్ బాడీ సమావేశం

హాజరైన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి :

కుషాయిగూడలో యువకుడి అదృశ్యం

మున్సిపల్ అభివృద్ధికి అందరు సహకరించి పని చెయాలనీ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కొత్తకోట మున్సిపల్ కార్యాలయం లో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో స్థానిక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో కలసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్, ట్రాఫిక్, పారిశుద్ధ్య నిర్వహణ పనులు, సీసీ రోడ్లు, త్రాగునీరు, విద్యుత్, మౌలిక వసతులు తదితర అంశాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల తరువాత ఈ మొదటి జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో నూతనంగా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదం, దీవెనలతో గెలిచినా మీరు మంచి పనులు, ప్రజలకు సేవ చెస్తే.. మీ పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందని తెలిపారు. నిబద్దత, క్రమశిక్షణ తో పని చేయాలి. భవిష్యత్తు తరానికి ఆదర్శంగా నిలువాలని చెప్పారు. ఎన్నికల సమయంలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు తీర్చడానికి నిరంతరం కృషి చేయండి, నా వంతు పూర్తి సహకారం అందజేస్తా, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. కొత్తకోట మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించి ఇటీవలే 17 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. కొత్తకోట మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించి, నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది, నిధులు కేటాయించడానికి ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని, నీటి సమస్యలు తలెత్తకుండా, అధికారులు, ప్రజాప్రతినిధులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. నీటి సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, దాని కోసం ఎన్ని నిధులైన ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 6 కోట్ల రూపాయల నిధులతో సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి, 2 కోట్ల రూపాయల నిధులతో పార్కుల డెవలప్మెంట్ కు నిధులు కేటాయించామని తెలిపారు. 1 కోటి, 50 లక్షల నిధులతో స్ట్రోమ్ వాటర్, డ్రైన్ల నిర్మాణానికి, 5 కోట్ల నిధులతో చేనగ చెరువు కట్ట పై, వెంకటగిరి రహదారిపై సంత బజార్ ఏర్పాటు చేయడంతో పాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి బ్యూటీఫికేషన్ పనులు నిర్వహిస్తామని తెలిపారు. డివైడర్ పై కొనో కార్పస్ మొక్కలను తొలగించి, బ్యూటీఫికేషన్ పనులు చేపడతామని పేర్కొన్నారు. విద్యుత్ లైన్ల కు సంబంధించి, ఐరన్ పోల్స్ పూర్తిగా తీసివేసి, కొత్త పోల్స్ త్వరలో వేస్తామని తెలిపారు. కొత్తకోట మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, కొత్తకోట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ, వైస్ చైర్మన్ పల్లవి సునీత, కౌన్సిలర్లు అఖిల, సుధారెడ్డి, బోయోజ్, అయ్యన్న, రవీందర్ రెడ్డి, తిరుపతి, మురళి, చంద్రకాంత్, సంజీవుడు తదితరులు పాల్గొన్నారు.