Breaking News

కేజీబీవీ లకు కేటాయించిన బడ్జెట్ వినియోగించాలి.

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ తెలిపారు

మనప్రగతి న్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:

కుషాయిగూడలో యువకుడి అదృశ్యం

జోగులాంబ గద్వాల్ జిల్లాలోని కేజీబీవీలకు కేటాయించిన బడ్జెట్ను పూర్తిగా వినియోగించి మౌలిక సదుపాయాలు కల్పించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. కేజీబీవీలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అనుమతి లేకుండా ఎవరిని పాఠశాలలోకి అనుమతించరాదన్నారు. విద్యార్థుల సంక్షేమం భద్రతపై ప్రిన్సిపాల్ దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన భోజనమును, మరియు విద్యను విద్యార్థులు స్వీకరించాలన్నారు. కష్టపడి చదివి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించి ఉన్నత ఉద్యోగాలు పొందాలని ఆయన కోరారు.