Breaking News

పంతంగి టోల్ గేట్ వద్ద అక్రమ గంజాయి పట్టివేత

మన ప్రగతి న్యూస్ /రామన్నపేట:

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి-65 పంతంగి టోల్ గేట్ వద్ద ఆటోలో తరలిస్తున్న 60.685 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది.ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎ. శ్రీనివాస్ రెడ్డి,డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్అధికారి ఎం.విష్ణు మూర్తి ల ఆదేశాల మేరకు రామన్నపేట ఎస్ హెచ్ ఓ ఆర్. బాళోజి నాయక్ మరియు మోత్కూర్ ఎస్ హెచ్ ఓ కె. రవిచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పంతంగి టోల్గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదం గా వస్తున్న ఒక ఆటోను ఆపి తనిఖీ చేయగా దానిలో 60.685కిలోల ఎండు గంజాయి లభ్యమైందని.ఈ గంజాయి ని ఏ1 గా మహారాష్ట్ర కు చెందిన గంగా బాయ్ పాండు రంగ్ చౌహన్,ఏ2గా కమల్ అర్జున్ మోహితే,ఏ3 గా విజయ్ ఆసరం గోరపడే,నల్గొండ కు చెందిన వ్యక్తి వల్లపు దాసు వేణు కుమార్ ఏ4గా ఉండగా,వీరంతా ఒడిశా రాష్టం లోని భరంపూర్ నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర కి తరలిస్తూ పట్టుబడ్డారని.తదుపరి విచారణ నిమిత్తం ఈ గంజాయిని,1 ఆటో , 2సెల్ ఫోన్,ముద్దాయిలను మరియు ముద్దాయి వద్ద గంజాయి ( వీటి మొత్తం విలువ సుమారు రూ.25లక్షలు)రామన్నపేట ఎక్సైజ్ స్టేషన్ కి తరలించడం జరిగిందని బాళోజీ నాయక్ తెలిపారు.ఈ తనిఖీలలో ఎస్ఐలు ఎన్. శంకర్, బి. శివ కృష్ణ,పి. సత్యనారాయణ కానిస్టేబుల్స్ తిరుమలేష్,రావొజీ, అనిల్, కృష్ణ రెడ్డి, గోపీనాథ్ రెడ్డి, వెంకట్, రహమాన్, రమేష్ రెడ్డి , సోనీ,స్వప్న లు పాల్గొన్నారు.

కుషాయిగూడలో యువకుడి అదృశ్యం