Breaking News

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి :

మక్కల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి లోయలో పడి గాయాల పాలైన క్షతగాత్రులను టి పి సి సి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.మంగళవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి మూల మలుపు వద్ద అదుపుతప్పిన లారీ లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో పలువురు గాయపడగా హైదరాబాద్ నుండి పాలకుర్తికి వెళ్తున్న టీపీసీసీ ఉపాధ్యక్షు
రాలు ఝాన్సీ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.ఆమె వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితులకు అండగా ఉంటామని, అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఝాన్సీ రెడ్డి తెలిపారు. ఆమె వెంట అప్పిరెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌడగాని నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.

కుషాయిగూడలో యువకుడి అదృశ్యం