మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏ ఎస్ రావు నగర్ డివిజన్ అరుల్ నగర్‌కు చెందిన ఫిర్యాదుదారుడు షాగరి రమేష్ భార్య సంతోషి (35) సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. ఆమె తన పుట్టినిల్లయిన ఆలేరుకు వెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. అయితే అక్కడ కూడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద గాలించారు. ఎక్కడా ఆమె వివరాలు తెలియకపోవడంతో రమేష్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె గురించి సమాచారం తెలిసిన వారు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

