Breaking News

కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ

జిల్లా కాంగ్రెస్ పార్టీ ద్యక్షులు సంగీతం శ్రీనివాస్

అక్క పెళ్లి బండ లింగంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు

మన ప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట

కుషాయిగూడలో యువకుడి అదృశ్యం

కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ అని జిల్లా కాంగ్రెస్ పార్టీ ద్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు, ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామంలో బత్తుల రాజమణి ఆశయ్య బండ లింగంపల్లి గ్రామంలో మెతుకు సుజాత బాలచందర్ యాదవ్ లు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకుని మంగళవారం గృహాప్రవేశ వేడుకలు జరుపుకున్నారు,
ఈ సందర్భంగా అక్క పల్లీలో ఏఎంసీ చైర్మన్ షేక్ సాబేర బేగం గౌస్ ముఖ్యఅతిథిగా పాల్గొని స్థానిక సర్పంచ్ మాదాసు స్రవంతి బాబు తో కలిసి రిబ్బన్ కత్తిరించి గృహప్రవేశం ప్రారంభించారు. అదేవిధంగా బండ లింగంపల్లి గ్రామంలో మెతుకు సుజాత బాలచందర్ యాదవ్ ల ఇందిరమ్మ ఇళ్ళు నూతన గృహాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఏఎంసి చైర్మన్ షేక్ సాబేరా బేగం స్థానిక సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ తో కలిసి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు, జిల్లా అద్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు
ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అని అన్నారు, ఏఏంసి చైర్మన్ షేక్ సాబేరా బేగం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు దొమ్మటి నరసయ్య లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తామని ప్రకటించడం పట్ల రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు, ప్రతిపక్ష పార్టీలు దీనిని రాజకీయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు, గతంలో బేస్మెంట్ వరకు నిర్మించుకున్న ఇళ్లకు నాలుగు లక్షల రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు,
నియోజకవర్గంలో అభివృద్ధికి సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి నిధులు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య పంచాయతీ కార్యదర్శులు కృష్ణ యాదవ్ పవిత్ర గ్రామ శాఖ అధ్యక్షులు జంగ భూంరెడ్డి బాల్రాజ్ రమేష్ గౌడ్ ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయ్ జిల్లా అధ్యక్షులు సాహెబ్ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి మర్రి శ్రీనివాస్ రెడ్డి బండారి బాల్రెడ్డి జంకె లచ్చిరెడ్డి జంకె జనార్దన్ రెడ్డి పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గుర్రాల రాజిరెడ్డి మెండే శ్రీనివాస్ యాదవ్ , ఎల్లా గౌడు సిరిపురం మహేందర్ దొమ్మాటి రాజు ఆకారం రాజు పడిగేల రవి గుప్తా తదితరులు పాల్గొన్నారు,