మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. వాసవి శివ నగర్ నివాసి ధనాల లక్ష్మి కుమారుడు ధనాల శ్రీశైలం (21) ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లాడు.
ఇంట్లో చిన్నపాటి విషయంలో కుటుంబ సభ్యులతో జరిగిన వాగ్వాదం కారణంగా ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి లక్ష్మి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. శ్రీశైలం ఆచూకీ తెలిసిన వారు కుషాయిగూడ పోలీసులను సంప్రదించాలని కోరారు.

