Breaking News

పిడుగుపాటుతో తాడిచెట్టు దగ్ధం..

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

శంకరపట్నం మండలంలో బుధవారం తెల్లవారుజాము నుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.తాడిచెట్టు పై పిడుగు పడిన సంఘటన రాజాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.రాజాపూర్ గ్రామంలో తెల్లవారు జామున సమయంలో పెద్ద ఎత్తున వెలుబడిన శబ్దంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.ఈ పిడుగుపాటుతో తాడిచెట్టు పై భాగం పూర్తిగా ఆహుతైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

కుషాయిగూడలో యువకుడి అదృశ్యం