మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-
ప్రమాదవశాత్తు నీటిలో పడి వ్యక్తి మృతి ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై జయన్న కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరు పట్టణానికి చెందిన ఏ.రాములు ఉగాది పండుగ పురస్కరించుకొని గురువారం ఉదయం స్థానిక శ్రీ శ్రీ శ్రీ పరమేశ్వర స్వామి చెరువుకు వెళ్లి స్నానం చేసి వస్తానని తన భార్య మన్నెమ్మకు చెప్పి వెళ్లాడు. ఆత్మకూరు చెరువు కట్ట మెట్ల దగ్గర రాములు నీటిలో పడి ఆయాస పడుతూ నీళ్లు మింగుతూ బయటకు రావడానికి ప్రయత్నిస్తుండగా రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులు చూసి నీటిలో నుంచి మెట్ల పైకి తీసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని రాములు ను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు పరిశీలించి రాములు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. మృతుని భార్య మన్నెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జయన్న తెలిపారు.

