Breaking News

మనిషి ప్రాణాలకు విలువ కడుతున్న శ్రీ చైతన్య సెయింట్ పీటర్స్ హై స్కూల్

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి:

జగదేవపూర్ మండల కేంద్రం సమీపంలోని పీర్లపల్లి శివారులో రాజీవ్ రహదారిపై సెయింట్ పీటర్స్ హై స్కూల్ కు చెందిన బస్సు ఒక ద్విచక్ర వాహనాన్ని రమేష్ (48) అక్కడికక్కడే మరణించారు.అలాగే మరో వ్యక్తి ఆసుపత్రికి లోబైక్ వెనుక కూర్చున్న మల్లయ్య (60) మరణించారు. స్కూల్ బస్సు విద్యార్థులను నిబంధనలను అతిక్రమించడం మరియు నిర్లక్ష్యంగా అనుభవం లేని డ్రైవర్ బస్సు నడపడం వల్లే ఈ ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పెద్ద మరణిస్తే కుటుంబాలకు తీరని లోటును భర్తీ చేయలేవని స్థానికులు మరియు బాధితుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం బాధ్యతారాహిత్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.అలాగే గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినవి అయినా పాఠశాల పైన చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు బైకులు ఎదురెదురుగా ఢీ..వ్యక్తికి గాయాలు