మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
శంకరపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.కార్యాలయంలో స్బిబంది హాజరుపట్టిక,విధుల్లో ఉన్న ఉద్యోగుల వివరాలపై ఆరాతీశారు.ఆయన మాట్లాడుతూ ఎంపీడీవో తో పాటు సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు.గ్రామపంచాయతీ లలో పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా! ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సక్రమంగా ప్రజలకు చేరడంపై ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ ను తనిఖీ చేయాలని సూచించారు.

