మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన శంకరపట్నం మండలం మొలంగూర్ ఎక్స్ రోడ్డులో జరిగింది.సైదాపూర్ మండలం సోమారం గ్రామస్తులు కాశిపాక రమేష్ అతని కుమారుడు సంపత్ కేశవపట్నం నుండి సోమారం బయలుదేరారు.కొత్తగట్టు గ్రామస్తుడు నల్ల యుగేందర్ రెడ్డి కేశవపట్నం వెళ్తుండగా మార్గమధ్యలో మొలంగూర్ ఎక్స్ రోడ్డులో రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.ఈ ఘటనలో కాశిపాక రమేష్ కుడి కాలుకు తీవ్ర గాయమై రోడ్డుపై పడడంతో కుమారుడు సంపత్ 108 కి,పోలీసులకి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరు కున్న 108 సిబ్బంది ఈఎంటి గూడూరి సతీష్ రెడ్డి,పైలెట్ ఏం.గోపికృష్ణ ప్రథమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు.

