మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఒక చిన్నారిని చిదిమేసింది.కళ్ల ఎదుటే బిడ్డ లారీ చక్రాల కింద ఛిద్రమై ప్రాణాలు వదలడం చూసిన తల్లి దిక్కులు పిక్క టిల్లేలా రోదించింది.ఈ దారుణం శంకరపట్నం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా శనివారం జరిగింది.మహారాష్ట్ర నుండి రోడ్డు పక్కనే దాదాపు 20 సంవత్సరాలుగా నివాసముంటున్న చావన్ శ్రావణ్- పుష్పమాల దంపతులకు నలుగురు సంతానం. చిన్న కుమార్తె నిత్య(3) రోడ్డు పక్కనే ఉండగా వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.కళ్లెదుటే కుమార్తె నిత్య విగతజీవిగా పడి ఉండటంతో గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిని చూసి ప్రతి ఒక్కరూ కలత చెందారు.లారీ ఢీ కొట్టి పరారైందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.వివరాలు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


(బేబీ నిత్య ఫైల్ ఫోటో)..
