మన ప్రగతి న్యూస్/వీణవంక:
వీణవంక ముస్లిం సోదరులు రంజాన్ పండుగను అత్యంత వైభవంగా జరుపు కున్నారు. నెల రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పాటించిన ఉపవాస దీక్షల అనంతరం ..ఈద్ సందడి అన్ని ప్రాంతాల్లోనూ మిన్నంటాయి. వేలాది మంది ముస్లింలు ఒకచోట చేరి సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు త్వరగా ముగిసి, శాంతి సౌభ్రాతృత్వాలు నెలకొనాలని ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా దువా చేశారు.పరస్పరం ఆలింగనం చేసుకుంటూ ‘ఈద్ ముబారక్ ’ తెలుపుకుంటూ పండుగ శుభాకాంక్షలు మార్పిడి చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ దాసారపు సరోజినీ రాజేంద్ర ప్రసాద్, పాలకవర్గం ముస్లిం సోదరులకు స్వీట్లు అందించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు నీల శ్రీకాంత్, సమిల్ల ప్రశాంత, వోరెం అనూష అవినాష్, దాసరపు కొమురయ్య, భోగం అనిల్, గెల్లు కుమార్, రెడ్డి రాజు కళ్యాణి బిక్షపతి, పాస్తం కుమార్ సిరిగిరి పద్మ, మాజీ సభ్యులు ముస్లిం సోదరుల మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

