Breaking News

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి..

  • డాక్టర్ పి. స్వాతి..

మన ప్రగతి న్యూస్/నడికూడ:

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజలంద రూ వినియోగించుకోవాలని నడికూడ మండలం రాయపర్తి పి. హెచ్. సి. డాక్టర్ పి. స్వాతి అన్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా..రాయపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి హెచ్ సి)లో సోమవారం ఉచి త మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామ న్నారు. ఈ శిబిరాన్ని పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభిస్తా రని తెలిపారు.ఎమ్మెల్యే తో పాటు గ్రామ సర్పంచ్ రాజా జగత్ ప్రకాష్ కూడా పాల్గొననున్నారు. అనంతరం రాయపర్తి పి.హెచ్‌.సి. వైద్యాధి కారిణి డాక్టర్ పి. స్వాతి మాట్లాడుతూ.. ఈ శిబిరంలో ప్రజలకు స్పెషలిస్ట్ వైద్యులచే ఉచిత వైద్య పరీక్షలు, రక్తపరీక్షలు, చికిత్స అందించబడుతాయని తెలిపారు. అవసరమైన వారికి ఉన్నత స్థాయి ఆసుపత్రులకు రెఫర్ చేసి తదు పరి చికిత్స అందించే ఏర్పాట్లు కూడా ఉన్నా యని పేర్కొన్నారు. ఈ శిబిరం లో స్త్రీ రోగ నిపుణులు, ఆర్థోపెడిక్ (కీళ్ళు, ఎముక లు), చిన్న పిల్లల వైద్యులు, నేత్ర వైద్యు లు, దంత మరియు జనరల్ మెడిసిన్ నిపుణులు పాల్గొని సేవలు అందించనున్నారు. ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలు వినియోగించు కోవాలని తెలిపారు.

ఘనంగా రంజాన్ వేడుకలు..