మన ప్రగతి న్యూస్ హనుమకొండ జిల్లా ప్రతినిధి:
దామెర : విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన మండలం లోని ఊరుగొండ లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మండలం లోని ఊరుగొండ గ్రామానికి చెందిన చెలిక దామోదర్ తండ్రి రాజమౌళి వయస్సు (47) అనే రైతు తన వ్యవసాయ పంటకు నీరు పారిస్తుండగా కరెంట్ పోవడం తో సమీపంలో ఉన్న ట్రాన్స్ పార్మర్ వద్దకు పోయి చూస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురయ్యాడు.. చుట్టుప్రక్కల వారు గమనించి 108 కి సమాచారం ఇవ్వగా ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.. కాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించినట్లు తెలిపారు.. మృతుని భార్య చెలిక లలిత ఫిర్యాదు మేరకు దామెర ఎస్సై కొంక అశోక్ కేసు నమోద్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

