Breaking News

విద్యుత్ షాక్‌తో మృతిచెందిన రైతు మృతదేహాన్ని సందర్శించిన చల్లా ధర్మారెడ్డి..

మన ప్రగతి న్యూస్/ హనుమకొండ జిల్లా ప్రతినిధి:

దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన చేలికే దామోదర్ విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందిన ఘటనపై పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన వరంగల్ ఎంజీఎం మార్చురీలో దామోదర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చిన చల్లా ధర్మారెడ్డి, ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా అందించి న్యాయం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

దామెర మండలంలో ఇద్దరు మహిళల అదృశ్యం