Breaking News

గంజాయి బాధితుల అరెస్ట్

మన ప్రగతి న్యూస్/ రామన్నపేట:

రామన్నపేట పట్టణ శివారులో గల గరిక సత్యనారాయణ ఫంక్షన్ హాల్ వెనకాల ఉన్న కాళీ ప్రదేశం లో గంజాయి త్రాగుతున్నారని సమాచారం తెలుసుకున్న రామన్నపేట ఎస్సై డి.నాగరాజు, సిబ్బంది మరియు ఇద్దరి సాక్షుల సమక్షంలో ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా అక్కడ నలుగురు వ్యక్తులు నార్కట్ పల్లికి చెందిన పిల్లి నవీన్,ఏనుగుల దోరి గ్రామానికి చెందిన క్రాంతికుమార్,బాచుపల్లి గ్రామానికి చెందిన సూరారం ప్రసాద్, రామన్నపేటకు చెందిన మేడి లోకేష్ లు గా గుర్తించి,అక్రమంగా గంజాయి కలిగి ఉండడం చట్టరీత్యా నేరం కావున పంచనామా నిర్వహించి, వారి నుండి 120 గ్రాముల గంజాయి మరియు 3 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై డి.నాగరాజు తెలిపారు.

రాజన్‌పల్లి అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం