బ్రేకింగ్ న్యూస్
సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిసిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి
తెలంగాణ

గూడూరులో విషాదం..ట్రాక్టర్ ఇంజన్ మీద పడి విద్యార్థి మృతి.. 

మన ప్రగతి న్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ట్రాక్టర్ ఇంజన్ మీద పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన శనివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరులో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గూడూరు గ్రామానికి చెందిన కాసోజు ఉమా బ్రహ్మచారి దంపతుల ద్వితీయ కుమారుడు కాసోజు సాయి సంగీత్ (15) పదవ తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత ఇంటి వద్ద ఉంటున్నాడని తెలిపారు. ఇంట్లో ఉన్న సాయి సంగీత్ ను గూడూరు గ్రామానికి చెందిన యాదనాల రజిత చిరంజీవి దంపతుల కుమారుడు యాదనాల నితిన్ (ఎనిమిదవ తరగతి) ట్రాక్టర్ పై వ్యవసాయ భావి వద్దకు వెళ్లాలని ఇంటి వద్ద నుండి తీసుకువచ్చి ట్రాక్టర్ పై వ్యవసాయ భావి వద్దకు వెళుతడగా గూడూరు, మురుసుగడ్డ తండా మధ్యలో గల మూల మలు
పు వద్ద ట్రాక్టర్ ఇంజన్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గొయ్యిలో పడిందని తెలిపారు. ట్రాక్టర్ పై కూర్చున్న సాయి సంగీత్ గొయ్యిలో పడడంతో సాయి సంగీత్ పై ట్రాక్టర్ ఇంజన్ పడిందని తెలిపారు. ట్రాక్టర్ నడపుతున్న మైనర్ బాలుడు నితిన్ ట్రాక్టర్ పై నుండి క్రిందికి దూకగా సాయి సంగీత్ అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. పదవ తరగతి పరీక్ష వ్రాసి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సాయి సంగీత్ మృతి చెందడంతో గూడూరు గ్రామంలో విషాదం నెలకొంది. స్నేహబంధం ప్రాణం తీసిందని సాయి సంగీత్ తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతుడి తండ్రి బ్రహ్మచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దూలం పవన్ కుమార్ తెలిపారు.