Breaking News

మార్షల్ ఆర్ట్స్ బాలికల ఆత్మ రక్షణకు ఎంతో అవసరం స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

మన ప్రగతి న్యూస్/హత్నూర:

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

మార్షల్ ఆర్ట్స్ ఉష్షు వంటి ఆత్మ రక్షణ విద్య పోటీలలో పాల్గొని రాష్ట్రస్థాయిలో గెలుపొందడంతో పాటు జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించడం అమ్మాయిలలో అరుదైన విషయమని, ఇలాంటి విజయాలు సాధిస్తూ అమ్మాయిలు ముందుకు రావాలని స్థానిక ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని సిరిపుర గ్రామానికి చెందిన కాలే నాగేశ్వరి, ఇటీవల హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి మార్షల్ ఆర్ట్స్ ఉష్షు పోటీలో పాల్గొని బంగారు పతకం సాధించింది. దీంతో పంజాబ్ రాష్ట్రంలో డిసెంబర్ ఒకటి నుంచి ఆరవ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సునీత రెడ్డి శనివారం ఆమెను సన్మానించి జాతీయ స్థాయి పోటీలకు వెళ్లేందుకు ఆర్థికంగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిరిపురం గ్రామ మాజీ సర్పంచ్ మచ్చ నరేందర్, వారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ పోచయ్య, వీరేశం తదితరులు ఉన్నారు.