Breaking News

శ్రీ చైతన్య కాలేజీలో ఆగని ఆత్మహత్యలు

మన ప్రగతి న్యూస్ /హైదరాబాద్
చాలామంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం అంటూ, వారి పిల్లలకు ఇష్టం లేకున్నా కార్పొరేట్ కళాశాలలో జాయిన్ చేసి లక్షల్లో ఫీజులు కట్టి వారి పిల్లలను వారే చంపుకుంటున్నారు.

విజయవాడకు చెందిన కౌశిక్ రాఘవ (17) మియాపూర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవ త్సరం చదువుతున్నాడు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

ఈ క్రమంలోనే అతడే హాస్టల్ గదిలో శుక్రవారం అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యను కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.