ప్రాణాలు పోగొట్టుకుంటున్న అమాయకులు
మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం కేంద్రంలో మునిగడప, అనంతసాగర్, తీగుల్ తిమ్మాపూర్, అనంతసాగర్, గ్రామంలో రోడ్డుపై విచ్చలవిడిగా వడ్లను రైతులు ఆరబెడ్డుతున్నారు. వడ్లను రోడ్ల పై ఆరబెట్టడం ద్వారా రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. రోడ్లపై దాన్యం కోయడం వల్ల ఎలాంటి సంబంధం లేని అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పటికి పలుమార్లు ఫిర్యాదు చేసిన ఇలాంటి స్పందన లేదు .ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.