మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మున్సిపల్ పరిధి బాచుపల్లి నుంచి మల్లంపేట వారికి ఓల్డ్ హైదరాబాద్ రోడ్డు సర్వేనెంబర్ 39, 38, 54 మరియు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్డు నందు ఆక్రమణలు తీసేసి తక్షణమే రోడ్డును పునరుద్ధరించాలని హెచ్ఎండిఏ అధికారులు 13-11-2024 నిజాంపేట కమిషనర్ కి 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కానీ నిజాంపేట కమిషనర్ చర్యలు తీసుకోకపోవడం పై బుధవారం మల్లంపేట ప్రజలు నిజాంపేట్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది.
దీనిపై గురువారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుంటే శుక్రవారం నిజాంపేట్ కమిషనర్ కార్యాలయం ముట్టడిస్తామని ఎంబరి ఆంజనేయులు, పిసరీ కృష్ణారెడ్డి, ఆకుల సతీష్ హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని మల్లంపేట నుండి బాచుపల్లి వరకు తక్షణమే రెవెన్యూ రోడ్డుని మరియు మాస్టర్ ప్లాన్ రోడ్ ని పునరుద్ధరించాలని, దీని వల్ల ప్రతినిత్యం మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుండి బాచుపల్లి వరకు ట్రాఫిక్ రద్దీన్ పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని, అధికారులు ప్రజాప్రతినిధులు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారు అని, లేకుంటే ప్రజాగ్రహాలు చూస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, ఈశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, కృష్ణ, శ్రీధర్, శ్రీకాంత్, లక్ష్మణ్, షోరూం సాయి, మణిదీప్, తదితరులు పాల్గొన్నారు.