Breaking News

సత్తుపల్లిలో జరిగే సిపిఎం 22వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి

మన ప్రగతి న్యూస్ / సత్తుపల్లి ఆర్సీ

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం

స్థానిక సత్తుపల్లి రావి వీర వెంకయ్య భవన్లో సిపిఎం సత్తుపల్లి పట్టణ కమిటీ సమావేశం అధ్యక్షతన జరిగినది ఈ సమావేశంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఈనెల 18, 19 తేదీల్లో సత్తుపల్లి పట్టణంలో జరిగే సిపిఎం 22వ జిల్లా మహాసభలను జయప్రదం చేయటం కోసం పార్టీ శ్రేణులంతా కంకణ బద్ధులై పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అదేవిధంగా మహాసభ ప్రారంభం సందర్భంగా సత్తుపల్లి సిపిఎం కార్యాలయం నుండి డిసెంబర్ 18 ఉదయం మహాసభలో సూచికగా ర్యాలీ నిర్వహించినట్లు తెలియజేశారు అదేవిధంగా మహాసభలు జయప్రదం కోసం బైక్ ర్యాలీ, టూ కే ర, ప్రభాతభేరీలు, నిర్వహించనున్నట్ల తెలిపారు, ఈ మహాసభలకు జిల్లా నలుమూలల నుంచి 500 మంది డెలిగేషన్ హాజరవుతున్నారు రెండు రోజులు పాటు జరిగే ఈ మహాసభలను జయప్రదానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు, ఈ మహాసభలకు జాతీయ,రాష్ట్ర, జిల్లా, నాయకులు మహాసభలకు హాజరవుతున్నారు, ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, సిపిఎం సత్తుపల్లి పట్టణ కార్యదర్శి, కొలిగపోగు సర్వేశ్వరరావు, రైతు సంఘం నాయకులు రావుల రాజబాబు, మోరంపూడి వెంకట్రావు, రమేష్, వలి, కుమారి ,ఝాన్సీ, రాము ,శ్రీహరి మరియు తదితరులు పాల్గొన్నారు.