Breaking News

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక చేయూత 

61 వేలు అందించిన పూర్వ విద్యార్థులు 

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

పాలకుర్తి గ్రామానికి చెందిన కన్నబోయిన రమేష్ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందడంతో 2001- 2002 బ్యాచ్కు చెందిన పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులు ఆదివారం రమేష్ కుటుంబ సభ్యులకు 61 వేల 300 ఫిక్స్ డిపాజిట్ చేసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ రమేష్ మృతి బాధాకరమన్నారు. పదవ తరగతి బ్యాచ్ లో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన అండగా నిలిచి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పూర్వ విద్యార్థులు రమేష్ కుటుంబానికి అండగా నిలవడం పట్ల రమేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోచిదురాల రాజు, కత్తుల రామ చందర్ యాదవ్, దుంపల సంపత్,చిలుకమారి శ్రీధర్,ఎండి, రహేమాన్,జిట్టబోయిన సంతోష్.
 గుంటిపల్లి గోవర్ధన్,రేగుల పర్శరాములు,పోగు గోపి, ఎండి, రహీమ్,ఎండి.తాహిర్ లతోపాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.