మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి
సిద్ధిపేట జిల్లా జగదేవ్ పూర్ మండల పరిధిలోని పీర్లపల్లి గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సోషల్ మీడియాలో పరిచయంతో పీర్లపల్లికి చెందిన దయాకర్ తో యువతి వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన నెల రోజులకే అనుమానాస్పస్థితిలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరకట్న వేధింపుల కారణంగానే హత్య చేసినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు.