మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
నిత్యవసర సరుకుల రేట్లు రోజురోజుకీ ఆకాశాన్ని అంటుతున్నాయని పెరిగిన ధరల కనుగుణంగా హమాలి కూలి రేట్లు పెంచాలని బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు. ఈరోజు మార్కెట్ ఖరీదు, ఫర్టిలైజర్ యూనియన్, ఐరన్ అండ్ మర్చంట్ యూనియన్ అధ్యక్షుడు వంగేటి గోవర్ధన్, దోమ కుంట్ల సురేష్ బూర అశోక్ లకు బి ఆర్ టి యు, ఏఐటీయూసీ అనుబంధం హామాలి సంఘల ఆధ్వర్యంలో నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు హమాలి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరు లక్ష్మీనారాయణ ఏఐటీయూసీ జిల్లా నాయకుడు గుంపెల్లి మునీశ్వర్ మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు నూతన రేట్ల ఒప్పందం ఉంటుందని డిసెంబర్ 21 తో ఆ గడువు పూర్తవుతుంది కావున నూతన రేట్ల అగ్రిమెంట్ చేసుకోవడానికి కార్మిక సంఘాలతో చర్చలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుండెబోయిన కొమరయ్య హమాలి పెద్దమనుషులు ఎడ్ల నాగులు యారా చంద్రమౌళి వడిచెర్ల శ్రీనివాస్ గాండ్ల రాములు రమేష్ ఎలేందర్ తదితరులు పాల్గొన్నారు.