మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి
సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో ఇద్దరి ప్రేమాయణం పెళ్లి వరకు చేరి గత 20 రోజుల క్రితం పెళ్లి చేసుకొని పెళ్లి ఐన 20 రోజులకే వివాహిత అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా మోసర మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శ్రుతి (22) సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడి తో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. మృతురాలు శృతి ఒక ప్రముఖ గాయని ఫోక్ సాంగ్స్ పాడుతూ హైదారాబాద్ లో ఉండేది. ఇదే క్రమం లో దయాకర్ తో ప్రేమలో పడి తరచూ దయాకర్ స్వగృహం అయినా పీర్లపల్లి వస్తూ ఉండేది. ఇద్దరి తల్లిదండ్రులను ఓప్పించి వివాహం చేసుకోవాలని చూడగా శృతి తల్లి దండ్రులు ఈ వివాహానికి ఒప్పుకోకపోవడం తో ఇద్దరు కలిసి గత ఇరవై రోజుల క్రితం దయాకర్ స్వగృహం లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. హఠాత్తుగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రుతి అనుమానాస్పదంగా మృతి చెందటం తో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న మృతురాలి బంధువులు బోరున విలపిస్తూ ఆమె ఆత్మ హత్య చేసుకోలేదని తన భర్తే తనని చంపేశారని ఆరోపిస్తున్నారు.