మండల యువ నాయకులు మచ్చ గణేష్
మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి
మన భారత రాజ్యాంగ నిర్మాత, డా ” బి ఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అనుచిత వాక్యాలు చెయ్యడం సిగ్గు చేటు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల కేంద్ర మంత్రి ఐనా వ్యక్తి, అంబేద్కర్ పెట్టిన బిక్ష వాళ్ళ ఈరోజు కేంద్ర మంత్రి గా ఉండి, ప్రపంచ మేధావి ఐనా అంబెడ్కర్ గురించి మాట్లాడం సిగ్గు చేటు. ఏం తెలియని వాడు, ఒకటి రెండు పట్టాలు లేనివాడు కూడా ఈరోజు అంబేద్కర్ రాసిన చట్టాల గురించి మాట్లాడుతున్నార్రు. అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోయి ఉంటే, బీసీ, ఎస్సీ, ఎస్టి, మైనార్టీలు ఈరోజు చదువుకు, రాజకీయాల్లో పదవులకు దూరంగా ఉండి, కుల వృత్తులకే పరిమితం ఐపోయేవారు. నాయకుల్లారా.గుర్తు పెట్టుకోండి.అంబేద్కర్ గురించి కానీ, రాజ్యాంగం గురించి అనుచ్చితవాక్యాలు చేసిన యేండ్ల చరిత్ర ఉన్న ఏ పార్టీలు, నాయకులు కూడా ఈరోజు అధికారం లో లేరు.అంబేద్కర్ పేరు తలుచుకోకుండా అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదు.అంబేద్కర్ పై చేసిన వాక్యాలకు అంబెడ్కర్ కి, దండం పెట్టు క్షమాపణ కోరుకోకుంటే, మళ్ళీ ఎన్నికలో మీ అధికారం కొలిపోవడం తద్యం.