Breaking News

ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేస్తే సహించేది లేదు: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొంపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రక్కన ప్రజల తాగు నీటి కోసం 2017 లో నిర్మించిన వాటర్ ట్యాంకులను ఎలాంటి సమాచారం అందించకుండా కాంట్రాక్టర్ కూలగొట్టిన తీరును మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ తీవ్రంగా ఖండించారు. అనంతరం కొంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిత తనిఖీ చేసి విద్యార్థులకు మరుగుదోడ్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని హెడ్మాస్టర్ కి సూచించారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరి ప్రశాంత్ గౌడ్, కొంపెల్లి గ్రామ మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్, మాజీ ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి, ఆదిరెడ్డి మోహన్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ కావాలి గోపాల్, పూర్ణచంద్రరావు, అశోక్ రెడ్డి, దశరథ్, ఆంజనేయులు ముదిరాజ్, శ్రీనివాస్ గౌడ్, ఖదీర్, నవీన్ ముదిరాజ్, మరియు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి