- సీపీఐ మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్
మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: రాజ్యసభలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలు ప్రతి రోజు అంబేద్కర్, అంబేద్కర్ అనడం ప్యాషన్ అయిందని, ఇన్ని సార్లు భగవంతుని పేరు తలిస్తే ఏడు జన్మల దాక స్వర్గం ప్రాప్తి కలిగేది అని అంబేద్కర్ని కించపరిచే వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు ఆశీ, యాదయ్య ఆధ్వర్యంలో నిజాంపేట్ లోని ఏసీ కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యసభలో బాబా సాహెబ్ అంబేద్కర్ ను కించపరిచే వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోమ్ మంత్రి భారత దేశ ప్రజలకు బేషరతుగా వెంటనే క్షేమాపణలు చెప్పాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం వెంటనే అమిత్ షా ను మంత్రి మండలి నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అని హక్కులను కల్పించారు అని గుర్తుచేశారు. రాజ్యాంగం రచించే సమయంలో మిగతా సభ్యులు రకరకాల నిబంధనలు పెడితే అంబేద్కర్ మాత్రం కులం, మతం, లింగ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఉండాలని ఓటు హక్కు కలిపించారు. ఇలా అనేక హక్కులను రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి కల్పించారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసు, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.