Breaking News

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి – సిఐటియు దుండిగల్ మండల కన్వీనర్ బొడిగె లింగస్వామి

మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: పార్లమెంట్లో అత్యంత దారుణంగా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కొంపల్లిలో నిరసన ర్యాలీ నిర్వహించి అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు దుండిగల్ మండల కన్వీనర్ బొడిగె లింగస్వామి మాట్లాడుతూ… ప్రపంచ మేధావి అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితమంతా ఈ దేశం కోసం అంకితం చేసిన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా పార్లమెంట్లో కేంద్ర హోం శాఖ మంత్రి మాట్లాడడం అత్యంత దారుణమని అన్నారు. తక్షణమే అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించి అమీషాపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అమిత్ షా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ దేశంలో బిజెపి ప్రభుత్వం కావాలని భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడం కోసం, అలాగే అంబేద్కర్ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియకుండా ఉండాలని కుట్ర చేస్తున్నారని తెలిపారు. బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాల నుండి ప్రజలను పక్కదారి మళ్ళించడం కోసం బిజెపి ప్రయత్నం చేస్తుందని అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం మీద ధరల మీద సమాధానం చెప్పలేని కేంద్ర ప్రభుత్వం ప్రజల మధ్య ఐక్యతను విచ్చినం చేయడం కోసం మతకల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వాక్యాలను ఖండిస్తూ దేశ ప్రజలందరూ ఉద్యమాలు నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సత్యం, లక్ష్మయ్య, శ్రీను, దుర్గేష్, అమృత బాలమణి, వసంత యాదమ్మ, శాంతి, ఎల్లమ్మ, మంజుల, స్వరూప, లలిత తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి