Breaking News

సిద్ధార్థ విద్యార్ధికి కలెక్టర్ ప్రశంసలు

  • వ్యాస రచనా పోటీలో జిల్లా ప్రథమ బహుమతి

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయానికి చెందిన పదో తరగతి విద్యార్థి ఆర్.సంజయ్ ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా ప్రశంసించారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాస రచనా పోటీలో సంజయ్ ప్రధమ బహుమతి సాధించగా శుక్రవారం జనగామలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్వాన్ పాషా చేతుల మీదుగా సంజయ్ ప్రధమ బహుమతి అందుకున్నాడు. ఈ సందర్భంగా సదరు విద్యార్థిని, పాఠశాల యాజమాన్యాన్ని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ విద్యాలయం ప్రిన్సిపాల్ జక్కుల రవీందర్, కరస్పాండెంట్ జక్కుల ఊర్మిళ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం