Breaking News

గురుకుల విద్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్.

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్

ఏన్కూర్ లోని బాలుర గురుకుల విద్యాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు. పాఠశాల పరిసరాలను, డార్మెటరీని పరిశీలించారు. భోజనం మంచిగా ఉంటున్నదా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఒత్తిడి, భయం లేకుండా పరీక్షలను ప్రశాంతంగా రాయాలని, క్రమశిక్షణ, పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. ఈ సందర్భంగా గురుకుల విద్యాలయానికి స్పోర్ట్స్ పరికరాల కొనుగోలు కోసం కలెక్టర్ 25 వేల రూపాయల చెక్కును అందజేశారు. కాంపౌండ్ వాల్, డార్మెటరీ, టాయిలెట్ స్ట్రీట్ లైట్స్ తదితర సమస్యలను ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం