ముఖ్యఅతిథిగా సిడిపిఓ నిర్మలా జ్యోతి
అంగన్వాడీ టీచర్లు కు వాటర్ బాటిల్స్ పంపిణీ
మన ప్రగతి న్యూస్/ ఖమ్మం జిల్లా స్టాపర్

కల్లూరు ప్రాజెక్టు పరిధిలో పేరువంచ సెక్టార్ సూపర్ వైజర్ భవాని ఆధ్వర్యంలో తిరువూరు క్రాస్ రోడ్ అంగన్వాడి సెంటర్ నందు బుధవారం జరిగిన సెక్టార్ మీటింగ్ లో వేసవికాలంలో గర్భిణీ స్త్రీలు, పిల్లలు తీసుకునే పోషక ఆహారం ,వారు తీసుకునే జాగ్రత్తలు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథితులుగా సిడిపిఓ నిర్మలా జ్యోతి,పోషణ అభియాన్ బీసీ హరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో గర్భిణీ స్త్రీలు,ఫ్రీ స్కూల్ పిల్లలు బాలింతలు తీసుకునే పోషకాహారం,దాని ఆవశ్యకత గురించి అంగన్వాడీ టీచర్ల కు అవగాహన కల్పించారు. స్కూల్ నిర్వహణలో అలసత్వం వహించొద్దని,సమయపాలన పాటించాలని,

ఫ్రీ స్కూల్ నిర్వహణ బాధ్యతగా నిర్వహించాలని అన్నారు.ఫీడింగ్ సక్రమంగా అధించాలని ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ కి తెలిపారు. ఈ సందర్భంగా తిరువూరు క్రాస్ రోడ్ అంగన్వాడి సెంటర్ టీచర్ ఖమ్మంపాటి రాణి ఎండ తీవ్రత దుష్ట్య తోటి అంగన్వాడీ టీచర్లకు ఏర్పాటు చేసిన వాటర్ బాటిల్స్ ని సిడిపిఓ, సూపర్ వైజర్ చేతుల మీదుగా అంగన్వాడీ టీచర్స్ కి అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు కృషవేణి,శ్రీదేవి,రాజేశ్వరి తరితరులు పాల్గొన్నారు.