మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
ప్రముఖ సాహిత్యవేత్త, తత్వవేత్త రసరేఖ సంపాదకులు కీ శే ముంగరజాషువ సంస్మరణ సభ నేడు హిల్ కాలనీ కెనాల్స్ లో జరిగింది, పద్యకవిగా అవధానిగా తాత్విక వ్యాసకర్త గా రసరేఖ సంపాదకులుగా ముంగరజాషవా సాహిత్య సృజన చేసి చరితార్థులైనారని వక్తలు కొనియాడారు.
సంజీవదేవ్ ప్రియశిష్యుడిగా
సత్యాన్వేషణ తో హేతుబద్ధ రచనలను ఆవిష్కరించారన్నారు
నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో 40 సంవత్సరాలుగా సమర్థవంతం గా చిత్తశుధ్ధితో పనిచేసారన్నారు అక్షర తపస్వి గా మౌనమునిలా
సాగర్ లో గీతిక సంస్థ స్థాపించి ఘనంగాసాహిత్య కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారని వారికి ఘన నివాళులు అర్పించారు
ప్రముఖ కవి సరికొండ నరసింహ రాజు సమన్వయకర్త గా వ్యవహరించారు.
ఈ సందర్భంగా ప్రముఖ కవి నల్లగొండ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అంగులకుర్తి విద్యాసాగర్ జాషువా తో వున్న అనుబంధాన్ని సందేశం ద్వార పంపారు ఎందరో సాహిత్యవేత్తలు తమకున్న అనుబంధాలని ,ప్రసంగా లను పంపారు,
జాషువా సంతానం సుగుణాకర్ కవితావల్లి నీలాంబరి వందన సమర్పణచేసి
కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం లో ప్రముఖ సాహిత్యవేత్తలు లింగం వీర భద్ర కవి,సంజీవి వేనేపల్లి పాండురంగారావు, ఎన్ టి పీ ఏ సతీష్ బాబు ,జానపాటి రాములు,మండల విద్యాధికారి కె. శ్రీనివాస్,పాస్టర్ ప్రసాద్,సమతా ప్రసాద్, బెల్లం ప్రభాకర్,రాజా,లింగాల పెద్దులు ,ప్రతాప్ బందు మిత్రులు,అభిమానులు పాల్గొన్నారు.