Breaking News

ప్రభుత్వం అందజేసిన నష్టపరిహారాని రైతులు సద్వినిగం చేసుకోవాలి

  • వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
    మన ప్రగతి/ వికారాబాద్ ప్రతినిధి : ప్రభుత్వం అందజేసిన నష్టపరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ రైతులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలం, హకీంపేట కు సంబంధించిన రైతులకు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, తహశీల్దార్ కిషన్ లతో కలిసి నష్ట పరిహార చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ… పారిశ్రామిక పార్కులో భూములను కేటాయించిన రైతులకు ఓకే దఫాలో నష్టపరిహార చెక్కులను అందజేయడం జరిగిందన్నారు.
    భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం తమ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇట్టి డబ్బులను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. దుద్యాల మండలం, హకీంపేటలో సర్వే నెంబర్ 252 లో 24 మంది రైతులు 32 ఎకరాల భూమిని బహుళార్ధసాధక పారిశ్రామిక పార్క్ కు తమ భూములను కేటాయించేందుకు సమ్మతి తెలుపనైనది, పారిశ్రామిక పార్కు కు భూములను కేటాయించిన రైతులకు నష్టపరిహారం కింద 6.44 కోట్ల రూపాయల చెక్కులను అందజేయడం జరిగిందని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం