Breaking News

బెల్లంపల్లిలో ట్రాఫిక్ సమస్య తీర్చండి

  • పాత బస్టాండ్ నుంచి కాంట వరకు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ఏసిపి రవికుమార్ కు వినతి పత్రం అందజేత

మన ప్రగతి న్యూస్/ మంచిర్యాల జిల్లా ప్రతినిధి:

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ ప్రాంతాలలో ఎం.సి.పి.ఐ.యూ పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలోని పాత బస్టాండ్ నుండి కాంటవరకూ ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని ఏసిపి రవికుమార్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది.అనంతరం జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్,సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరిగిపోతుందని పుర విధులలో ట్రాఫిక్ సమస్య ప్రధాన సమస్యగా మారిందని,పార్కింగ్ స్థలం లేక రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారని,రాత్రి సమయంలో రావలసిన హెవీ వెహికల్స్ ఉదయం రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దుకాణ యజమానులు సైతం షాపుల ముందు ఉన్న కాస్త స్థలాన్ని టీ షాపులకు,తోపుడుబండ్లకు, జ్యూస్ స్టాళ్లకు,కిరాయిస్తూ పార్కింగ్ స్థలం లేకుండా చేస్తున్నారని రోడ్డుపై వరకు నడిరోడ్డు పైన వాహనాలు పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారని,ఆర్టీసీ బస్సులు కూడా రోడ్డుపైనే ఆపే పరిస్థితి నెలకొందని కావున ప్రజల సౌకర్యార్థం పట్టణంలో పాల్గొని స్థలాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకొని,ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని,హెవీ వెహికిల్స్ ను రాత్రి సమయంలోనే అనుమతించే చర్యలు తీసుకోవాలని షాపు యాజమానులతో మాట్లాడి షాపుల ముందు ఉన్న చిన్నచిన్న బండ్లను,తీసే విధంగా చర్యలు తీసుకోవాలని ఏసిపి,మున్సిపల్ కమిషనర్,ఆర్డీవోకు వినతి పత్రాలు అందజేస్తామని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎం.సి పి.యూ పార్టీ బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్,మండల కార్యదర్శి ఆరపెల్లి సతీష్,పోలోజు రామకృష్ణ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం