విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలు
మన ప్రగతి న్యూస్/ములకలపల్లి
పిఆర్టియు టిఎస్ ములకలపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మహిళా అంతర్జాతీయ దినోత్సవం వేడుకలో ఆనందం వ్యక్తం చేసిన మహిళా ఉద్యోగులు ,మహిళ ఉపాధ్యాయునీలు. శుక్రవారం మహిళా అంతర్జాతీయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన ములకలపల్లి ఎంపీడీవో రేవతి కొంత మంది అధికారులను సన్మానించారు. సన్మాన గ్రహీతలు మాజీ మండల విద్యాశాఖ అధికారి
శ్రీరామ్ మూర్తి, నూతన మండల విద్యాశాఖ అధికారి జి సత్యనారాయణ, పేమెంట్ కాబోతున్న వై శ్రీదేవి ఎల్ఎఫ్ఎల్ విజయపురి కాలనీ,హాజరైన జిల్లా అధ్యక్షులు డివిడి వెంకటేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి బి రవి
ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ పిఆర్టియు జిల్లా ఉపాధ్యక్షులు తేల్ల చెన్నయ్య, మండల పిఆర్టియు టీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత మహిళా శక్తి మహిళా పురోగతి సాధన కోసం అందరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా అధ్యక్షులు డివిడి వేంకటేశ్వరావు మాట్లాడుతూ మండలంలో ఇంత ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని, ఈ మండలంలోనే పునాదులు వేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు అధ్యక్షులు పూర్ణ , ప్రధాన కార్యదర్శి సీతారామ్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు వి శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి బి శంకర్ , దశ్రు ,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రామస్వామి, మండల కార్యదర్శులు కృష్ణ రవీందర్ , బుల్లయ్య ఆనందరావు, మహిళా మండల కార్యదర్శిలు సారమ్మ , ఎల్ సుజాత, వినోద, నాగమణి, ఆదిలక్ష్మి , పెద్దమయి , జ్యోతి ,రాజమ్మ ,శైలజ తదితరులు పాల్గొన్నారు.