రాష్ట్ర బడ్జెట్లో గ్రామపంచాయతీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.
గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు చిక్కుల శ్రీను, గంటా శ్రీనివాసరావు డిమాండ్.
మన ప్రగతి న్యూస్/ములకలపల్లి
ములకలపల్లి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు చెల్లించాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) మండల అధ్యక్ష కార్యదర్శులు చిక్కుల శ్రీను, గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంపీడీవో రేవతికి మెమొరండం అందజేశారు. గ్రామపంచాయతీలలో వివిధ రకాల పరిశుద్ధ్య పనులు చేస్తూ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు సేవలు అందిస్తున్నారని గ్రామపంచాయతీ కార్మికుల శ్రమను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగుల వలె గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ డిమాండ్ చేశారు.కానీ రాష్ట్ర ప్రభుత్వం 2025 జనవరి 1 నుండి కార్మికులకు వేతనాలను చెల్లిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వలేదని ఇప్పటికే రెండు నెలలు గరుస్తున్న ప్రభుత్వ ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో కార్మికులలో నిరాశ గురవుతున్నారని అన్నారు. కార్మికుల వేతనాలకు బడ్జెట్లో ప్రత్యేక బడ్జెట్ కేటాయించి కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల బకాయిల వేతనాల పెండింగ్ బిల్లులలో జరుగుతున్న జాప్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎస్ టి ఓలలో నిలిచిపోయిన కార్మికుల వేతనాలను కార్మికుల అకౌంట్స్ లో వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు, వర్క రుక్మధరావు,జేఏసీ నాయకులు గద్దల మహేష్, బైటి అశోక్,మేకల రమేష్, కొక్కర గడ్డ సతీష్,పోక్కిలి నరేష్,సాయిరత్న,వగ్గేల దారయ్య,చనగాని శంకర్,వెలకం రాఘవయ్య, దుబ్బ భాస్కర్, బత్తుల సంజీవరావు,శ్రీను, తదితరులు పాల్గొన్నారు