మనప్రగతిన్యూస్ /చిట్యాల
భూపాలపల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ తాత బుర్ర కనకయ్య (99) బిజెపి సీనియర్ నాయకుడు గురువారం మధ్యాహ్నం 3గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. వారి పార్థివ దేహాన్నికి పూల మాల వేసి పార్టీ జెండా కప్పి అంతిమ యాత్ర లో పాల్గొన్న తెలంగాణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి మరియు భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిదర్ రెడ్డి. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల రఘు,మండల కార్యదర్శి నల్ల శ్రీనివాసరెడ్డి,సీనియర్ నాయకుడు చెక్క నర్సయ్య,మండల ఉపాధ్యక్షులు గజానాల రవీందర్,రాకేష్,శ్రీకాంత్,నాగరాజు,రాజు, తదితరులు పాల్గొన్నారు.