Breaking News

రోడ్లపై భారీగా దట్టమైన పొగమంచు..

  • తీవ్రమైన చలి గాలులు..
  • రాకపోకలకు తీవ్ర అంతరాయం..

మన ప్రగతి న్యూస్/ నడికూడ:

నడికూడ మండల కేంద్రంతో పాటు.. మండలంలోని పలు గ్రామాలలో శని వారం ఉదయం నుండే విపరీతమైన పొగ మంచు దట్టంగా వర్షంలా కురుస్తూ.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది.దారి నిండా పొగ మంచు కప్పుకొని ఉండటం వల్ల..ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించక పోవడం తో.. ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. దీనితో ప్రజలు ఇండ్ల నుండి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు.సూర్యోదయం అయినా కూడా సూర్యుని జాడ కనిపించక పోవడంతో అంతా చీకటి మయంగా కనిపిస్తుంది. దీనివల్ల విద్యార్థులు, ఉద్యోగస్తులు, రైతన్నలు, కూలీలు.. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలు, ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం