మన ప్రగతి న్యూస్ /చేవెళ్ల
చేవెళ్ల నియోజకవర్గం శంకరపల్లి మండలంలో గల టంగటూరు గ్రామం వద్ద అర్ధరాత్రి గ్రామ బిజెపి లీడర్ బద్దం శంబ రెడ్డి అనుమాన స్పదంగా మృతి చెందాడు. శుక్రవారం ఓదెల రైల్వే స్టేషన్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ తగిలి మృతి చెందాడని పోలీస్లు తెలిపారని స్థానికులు తెలిపారు. కానీ కుటుంబ సభ్యులు గ్రామ వాస్తవ్యులు కరెంట్ షాక్ తగిలితే మాకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ఎందుకు తీసారని ప్రశ్నిస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులకు, గ్రామ సర్పంచ్ గాని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారని ఈ ఘటనకు ఓదెలు రైల్వే స్టేషన్ సినిమా డైరెక్టర్డైరెక్టర్ అశోక్ కుమార్ ప్రొడ్యూసర్ ప్రశాంత్ సత్య బాధ్యత వహించాలని వారు తెలిపారు.