ఘనంగా మహిళా కార్మికులకు సన్మానం
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఈరే కార్ రమేష్ జి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం హిల్ కాలనీ మెయిన్ బజార్ మున్నా కాంప్లెక్స్ వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సిద్ధార్థ హోటల్, ఇళ్లలో, స్థానిక మున్సిపాలిటీ నందు వివిధరకాలు గా పనిచేయుచున్న మహిళా కార్మీకులైనటు వంటి హేమమ్మ ,సామ్రాజ్యం రమావత్ కవిత, పిట్ట మర్యాకుమారి ,అనురాధ లను శాలువాలతో సత్కరించి వారికి స్వీట్లు పంపిణీ చేసి వారు చేసిన సేవలను కోనయాడుతూ శుభాకాంక్షలు తెలపటం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ జి మాట్లాడుతూ మహిళలను గౌరవించుకునే బాధ్యత సమాజంలో అందరి పైన ఉందన్నారు,ఆకాశంలో సగం, అవకాశం లో సగభాగమైనటు వంటి మహిళలు అనేక రకాలుగా నిరాదరణకు గురికావడం ముఖ్యంగా ఆఫీస్ ,బస్ స్టాప్, రైల్వేస్టేషన్,బడి,అన్ని ప్రాంతాల్లో యాసిడ్ దాడులు, లైంగికంగా వేధింపులకు గురి కావడం జరుగుతుందని సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎన్ని చట్టాలను అమలు చేసినా మహిళల మీద దాడులు , దౌర్జన్యాలు ఆగడం లేదు రాజకీయంగా , సామాజికంగా, ఆర్థికంగా మహిళలు అన్ని రంగాల్లో ,సాధికారత, సాధించి సృజనాత్మకతతో ముందుకు వెళ్లాలని అన్ని కేటగిరీల లో రిజర్వేషన్లు పెంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సపావత్ చంద్రమౌళి నాయక్ ,ఆదాసు విక్రమ్, రామ్మోహన్ రాజు మంజుల జనార్ధన్, మున్నా , వల్లపు నాగార్జున, సైదారావు యోహాన్, రామస్వామి ,నక్క కిషోర్ ,పిట్ట సైదులు, మురళి గాజుల రాము తదితరులు పాల్గొన్నారు.