మనప్రగతిన్యూస్ /చిట్యాల
చిట్యాల గ్రామపంచాయతీ ఆవరణలో శనివారం గ్రామ సెక్రెటరీ అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది.ఈ ప్రోగ్రామ్ నకు జయప్రద సూపర్వైజర్ హాజరై మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. మహిళలు విద్య ఉద్యోగ రాజకీయ వివిధ వృత్తులలో ఎంతో అభివృద్ధిని సాధిస్తు కుటుంబ పరంగా అమ్మగా అక్క చెల్లిగా భార్యగా స్నేహితురాలిగా ఎన్నో పాత్రలను పోషించుతు మహిళా లేనిదే ప్రపంచమే శూన్యమని వివరించారు. కస్తూరిబా మేడం కవిత మమతగారు మాట్లాడుతూ ఆడవారుఎందులో తీసిపోరని సృష్టికి మూలం ఆడవారని ఆడవారు లేని ఇల్లు చీకటిగా ఆడవారే ఇంటికి దీపం లాంటివారని నేటి ఆడపిల్లలే రేపటి మహిళా మణులని వివరించారు.సెక్రెటరీ రవికుమార్ గారు మాట్లాడుతూ ఆడవారందరూ ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమదేవి లాగా ఎటువంటి భయభ్రాంతులకు లోను కాకుండా అన్ని రంగాలలో ముందంజ ఉండాలని తెలిపియున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సుమలత గారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం ఆడవారుఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ ఐకెపి సభ్యులు కస్తూరిబా టీచర్స్ మమత కవిత పిల్లలు మహిళలు హాజరైనారు.